Monday, 20 August 2018

Tella Tella Vare song from Gitagovindam lyrics in telugu foont


పల్లవి:

తెల్ల తెల్లవారె వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

దేవ దేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట  బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మాకోసం మళ్ళీ లాలి పాడేనంట

వచ్చిందమ్మా  వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మా హారతి పళ్లెం హాయిగా నవ్వే వొదినమ్మా

వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిలో చుక్కలో రెమ్మ నట్టింట్లోనా నెలవంక ఇక నువ్వమ్మా

తెల్ల తెల్లవారె వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా

సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి శర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి శర్వాణి

ఎద చప్పుడుకదిరే మెడలో తాళవనా ప్రతి నిముషం ఆయువునే పెంచేయనా
 కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా
కలలన్ని కాటుకనై చదివేనా
చిన్ని నవ్వు చాలె నంగానాచి కూన
ముల్లోకాలు మింగే మూతిముడుపుదానా
 ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళల్లోనా
 నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా

ఏ రాకాసి రాశో నీది ఏ ఘడియాల్లో పుట్టావే అయినా

వచ్చిందమ్మా  వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మా నా ఊహల్లోనా ఊరేగింది నువ్వమ్మా
వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిలో చుక్కలో రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చేరిపేసిందమ్మా




ఏకాంతాలన్ని ఏకాంతం లేకా ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నదిలేకా మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో వుండలేకా విరహం కనుమరుగయ్యే మనతో వేగలేకా కష్టం నష్టం మానె సొంతవాళ్ళురాకా కన్నీరొంటరాయె నిలువ నీడ లేకా

ఎంతదృష్టం నాదేనంటూ పగ పట్టిందే నా పైజమంతా

నచ్చిందమ్మా  నచ్చిందమ్మా  నచ్చిందమ్మా జన్మా  నీలో సగమై బతికే భాగ్యం నాదమ్మా
మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటున కుంకుమ బొమ్మా     వెయ్యేళ్ళాయుష్షంటూ  దీవించిందమ్మా

తెల్ల తెల్లవారె వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

6 comments: