పల్లవి
మబ్బులోన వాన విల్లులామట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
కోరుకున్న ప్రేయసివే
దూరమైనా ఊర్వసివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కసివే
చేప కళ్ళ రూపశివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలి చెలి రా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా
కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా
కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా
చరణం 1
చిన్నదానా ఓసి అందాల మైనామాయగా మనసు జారీ పడిపోయెనే
తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే
నీ లాగే కులికేనే నిన్ను చేరగా
ఎన్నాళైనా అవి ఎన్నేళ్లుఅయిన
వందేళ్లు అయినా
వేచి వుంటాను నిన్ను చూడగా
గండాలైన సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా
ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా
ఉందామా ఇదో ఎడతెగని హంగామా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా
చరణం 2
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే
కవ్విస్తూ కనపడే గుండెలోతులో
ఏం చేస్తున్నా నేను ఏచోట వున్నా
చూస్తూనే వున్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించనా రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తొద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా
No comments:
Post a Comment