Friday, 20 July 2018

Inkem Inkem Inkem Kaavaale telugu lyrics in telugu font


పల్లవి


తధిగిన తకజణు
తధిగిన తకజణు
తరికిట తధారిణ
తదీమ్ ధీమతః ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగా
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

గుండెల్లోనా వేగం పెంచావే
గుమ్మంలోకి హోళీ తెచ్చావే
నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే
నాకు ఒక్కోగంట ఒక్కో జన్మయి
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

తధిగిన తకజణు
తధిగిన తకజణు
తరికిట తధారిణ
తదీమ్ ధీమతః ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగా
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

చరణం 1

ఊహలకు దొరకని సొగస
ఊపిరిని వొదలని గొలుస
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొస

నీ కనుల మెరుపుల వరస
రేపినది వయసున రభస
నా చిలిపి కలలకు బహుశా
ఇది వెలుగుల దశా

నీ ఎదుట నిలబడు చనువే వీసా
అందుకొని గగనపు కొనలే చూసా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

చరణం 2


మాయలకు కదలని మగువా
మాటలకు దొరకని మధువా
పంతములు విడువని బిగువా
జరిగినదడగవా

నా కధని తెలుపుట సులువా
జాలి పడి నిముషము వినవా
ఎందుకని గడి కొక గొడవ
చెలిమిగా మెలగవా

నా పేరు తలచితే ఉబికే లావా
చల్లబడి నను నువ్వు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

గుండెల్లోనా వేగం పెంచావే
గుమ్మంలోకి హోళీ తెచ్చావే
నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే
నాకు ఒక్కోగంట ఒక్కో జన్మయి
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

తధిగిన తకజణు
తధిగిన తకజణు
తరికిట తధారిణ
తదీమ్ ధీమతః ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగా
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

pilla raa telugu lyrics in telugu font



పల్లవి

మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా

కోరుకున్న ప్రేయసివే
దూరమైనా ఊర్వసివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కసివే
చేప కళ్ళ రూపశివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలి చెలి రా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా
కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా
కళ్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే
మబ్బులోన వాన విల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
అందమైన ఆశ తీరక
కాల్చుతోంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా

చరణం 1

చిన్నదానా ఓసి అందాల మైనా
మాయగా మనసు జారీ పడిపోయెనే
తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే
నీ లాగే కులికేనే నిన్ను చేరగా
ఎన్నాళైనా అవి ఎన్నేళ్లుఅయిన
వందేళ్లు అయినా
వేచి వుంటాను నిన్ను చూడగా
గండాలైన సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా

ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా
ఉందామా ఇదో ఎడతెగని హంగామా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా


చరణం 2


అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే
కవ్విస్తూ కనపడే గుండెలోతులో

ఏం చేస్తున్నా నేను ఏచోట వున్నా
చూస్తూనే వున్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించనా రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తొద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా
యెల్ల విడిచి బతకనే
పిల్లా రా నువ్వే కనపడవా